హైదరాబాద్: 28°C
వార్తలు

విమానం రద్దు.. ఆందోళనకు దిగిన ప్రయాణికులు

ఢిల్లీ నుంచి అబుదాబి బయలుదేరాల్సిన ఎతిహాద్ ఎయిర్‌వేస్ విమానం రద్దు అయింది. దీంతో 200 మంది ప్రయాణికులు విమానాశ్రయంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. టెక్నికల్ సమస్య వల్లే విమానం రద్దు అయినట్లు విమాన సిబ్బంది వెల్లడించారు. అయితే సకాలంలో సమాచారం అందించకపోవడంతో ప్రయాణికులు నిరసనకు దిగారు. దీంతో ప్రత్యామ్నాయ విమానాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఎయిర్ లైన్స్ వెల్లడించింది.