ముంబై కోస్టల్ రోడ్డుపై ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఇవాళ తెల్లవారుజామున మెరైన్ డ్రైవ్ నుంచి హాజీ అలీ వైపు వేగంగా వెళ్తున్న BMW కారు అదుపుతప్పి వంతెన పైనుంచి కిందపడింది. గాల్లో రెండు పల్టీలు కొట్టి కింది నిర్మాణ ప్రాంతంలో కుప్పకూలింది. ఈ ఘోర ప్రమాదంలో కారులో ఉన్న ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల్లో షనయ్(21), 17 ఏళ్ల బాలుడు ఉన్నారు.
వార్తలు
వంతెన పైనుంచి కారు పల్టీ.. ముగ్గురు మృతి


