హైదరాబాద్: 28°C
వార్తలు

'కాంగ్రెస్ నేతల ఫాంహౌస్ టూర్ పెద్ద జోక్'

TG: కాంగ్రెస్ నేతల ఫాంహౌస్ టూర్ పెద్ద జోక్ అని కేంద్రమంత్రి బండి సంజయ్ విమర్శించారు. 'కేసీఆర్ ఫాంహౌస్ ఏమైనా టూరిజం కేంద్రమా. ప్రైవేట్ భూములను సందర్శించే అధికారం ఎక్కడిది. భూములకు సంబంధించిన ఆధారాలు బయటపెట్టండి. 22Aతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఖైరతాబాద్ ఉప ఎన్నికకు కాంగ్రెస్ భయపడుతోంది. ఉప ఎన్నికలో పోటీ బీజేపీ, BRS మధ్యే' అని పేర్కొన్నారు.