ముంబైలోని ప్రసిద్ధ లాల్‌బాగ్ గణేష్ మండపం వద్ద ఘోర విషాదం చోటుచేసుకుంది. ఇవాళ తెల్లవారుజామున విద్యుత్ షాక్ తగిలి ఎనిమిదేళ్ల చిన్నారి రాఘణితో పాటు మరో గుర్తుతెలియని మహిళ ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. రద్దీ ఎక్కువగా ఉండగా జరిగిన ఈ ప్రమాదంతో అక్కడ తీవ్ర విషాదం నెలకొంది. దీనిపై అధికారులు విచారణ జరుపుతున్నారు.
వార్తలు
లాల్‌బాగ్ గణేష్ మండపం వద్ద ఘోర విషాదం


