హైదరాబాద్: 28°C
వార్తలు

ICUలో పామును వదిలేశాడు..!

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌ ఆసుపత్రి ఐసీయూలోకి ఒక వ్యక్తి తనను కరిచిన పామును ప్లాస్టిక్ డబ్బాలో తెచ్చాడు. వైద్యులు వారించినా డబ్బా మూత తీయడంతో పాము వార్డులోకి జారుకుంది. దీంతో అధికారులు ఐసీయూ ఖాళీ చేయించి రోగులను తరలించారు. స్నేక్ క్యాచర్లు ఎంత వెతికినా పాము దొరకలేదు. పాముకాటు బాధితుడు ఎవరికీ చెప్పకుండా ఆస్పత్రి నుంచి వెళ్లిపోవడం గమనార్హం.