హైదరాబాద్: 28°C
వార్తలు

రాష్ట్రానికి భారీ వర్ష సూచన

AP: ఉత్తర అండమాన్ ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ ఈ నెల 22న తీవ్ర వాయుగుండంగా మారి.. 23న తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో కాకినాడ, అల్లూరి, ప్రకాశం, నెల్లూరు తదితర జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీరం వెంబడి గంటకు 40-50 కి.మీ వేగంతో బలమైన గాలులు వీయనున్నాయి.