హైదరాబాద్: 28°C
వార్తలు

మరో వందే భారత్ స్లీపర్ రైలు

న్యూఢిల్లీ-వారణాసి మధ్య రెండవ స్లీపర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను దీపావళికి ప్రారంభించాలని రైల్వే శాఖ యోచిస్తోంది. ప్రయాగ్‌రాజ్, కాన్పూర్ మీదుగా సాగే ఈ రాత్రిపూట సర్వీస్ ట్రయల్స్ సెప్టెంబర్‌లోనే ప్రారంభం కానున్నాయి. 16 కోచ్‌లు, 823 ప్రయాణీకుల సామర్థ్యంతో నడిచే ఈ రైలులో 11 ఏసీ 3-టైర్, 4 ఏసీ 2-టైర్, 1 ఫస్ట్ ఏసీ కోచ్ ఉండనున్నాయి.