హైదరాబాద్: 28°C
వార్తలు

యూపీఐ వద్దు.. నగదే ముద్దు!

UPI చెల్లింపులపై కొత్తగా ప్రతిపాదించిన MDRకు వ్యతిరేకంగా ఘజియాబాద్‌లో పలువురు వ్యాపారులు దుకాణాల వద్ద నోటీసులు ఏర్పాటు చేశారు. అక్టోబర్ 15 నుంచి రూ.2,000కు పైబడిన కొన్ని వ్యాపార లావాదేవీలపై 0.4 శాతం MDR వర్తించనుంది. ఈ నేపథ్యంలో UPI చెల్లింపులు స్వీకరించబోమని, నగదు మాత్రమే తీసుకుంటామని వ్యాపారులు హెచ్చరిస్తున్నారు. అయితే ఈ ఛార్జీ వ్యాపారులపైనే ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.