ఢిల్లీ వర్సిటీలోని విద్యార్థి సంఘం ఎన్నికల్లో ఏబీవీపీ విజయం సాధించటం పట్ల పలువురు కేంద్రమంత్రులు హర్షం వ్యక్తం చేశారు. కేంద్రమంత్రి నడ్డా మాట్లాడుతూ.. గూంజ్(ప్రతిధ్వని) అయితే వినిపించలేదు కానీ ధమాకా(పేలుడు) మాత్రం వినిపించిందని చెప్పారు. ఈ విజయం ఏబీవీపీ సిద్ధాంతం, నేషన్ ఫస్ట్ అనే భావజాలంపై ఉన్న నమ్మకాన్ని ప్రతిబింబిస్తుందంటూ విజేతలకు అభినందనలు తెలిపారు.
వార్తలు
ఏబీవీపీ విజయం.. కేంద్రమంత్రులు హర్షం


