హైదరాబాద్: 28°C
వార్తలు

వాణిజ్య ఒప్పందాలతో కొత్త అవకాశాలు: మోదీ

పలు దేశాలతో కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల వల్ల దేశీయ యువతకు కొత్త అవకాశాలను తెరుచుకున్నాయని ప్రధాని మోదీ వెల్లడించారు. భారత్‌ ఇప్పటివరకూ 40 స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలపై సంతకాలు చేసిందని తెలిపారు. వీటి వల్ల వ్యాపారులు, రైతులు, మహిళలు.. ఇలా ప్రతి ఒక్కరికీ కొత్త అవకాశాలు లభిస్తాయని చెప్పారు. యువతకు సమగ్ర అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.