హైదరాబాద్: 28°C
వార్తలు

ఎంపీ నేటి పర్యటన వివరాలు

విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఆదివారం సాయంత్రం 4 గంటలకు విజయనగరం టీడీపీ కార్యాలయంలో అందుబాటులో ఉంటారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో జరిగే సాంస్కృతికోత్సవాలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరవుతారు. ఈ మేరకు ఆయన క్యాంప్ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.