హైదరాబాద్: 28°C
వార్తలు

విమానంలో డిప్యూటీ సీఎం ఐఫోన్ మిస్సింగ్

లండన్ నుంచి ముంబై వస్తుండగా బ్రిటిష్ ఎయిర్‌వేస్ విమానంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే ఐఫోన్‌ను మిస్ అవ్వటం చర్చనీయాంశమైంది. ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగి పోయి షిండే ఇంటికెళ్లిపోయారు. అనంతరం ఫోన్ మిస్ అయినట్లు గ్రహించి సమాచారాన్ని విమాన సిబ్బంది అందించారు. దీంతో దాదాపు గంటపాటు సిబ్బంది గాలించిన తర్వాత ఐఫోన్ దొరికింది.