ASR: అనంతగిరి-1 బాలికల ఆశ్రమ పాఠశాలను అరకు ఎమ్మెల్యే మత్స్యలింగం శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వంటగది, కూరగాయల నిల్వ, వసతులు, హాజరు, స్టాక్, మెనూ రిజిస్టర్లను పరిశీలించారు. 420మంది బాలికలకు 15కేజీల కూరగాయలతో వంట చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనల ప్రకారం 57కేజీలు వండాలని సూచించారు. ప్రహరీగోడ లేక భద్రత సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.
వార్తలు
పాఠశాలను తనిఖీ చేసిన ఎమ్మెల్యే


