హైదరాబాద్: 28°C
వార్తలు

యువతకు అజిత్ దోవల్ కీలక పిలుపు

యువతకు జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్ కీలక పిలుపునిచ్చారు. శ్రీరాముడిలా యువత, విద్యార్థులు తమ జీవితంలో ధైర్యంగా ఉండాలని సూచించారు. ఆయనకున్న ధైర్యం కారణంగానే.. రాక్షసులను సంహరించడానికి విశ్వామిత్ర మహర్షి శ్రీరాముడిని ఎంచుకున్నారని ఉదాహరించారు. దేశం ప్రస్తుతం అత్యంత వేగంగా రూపాంతరం చెందుతోందని.. యువత ఒక అద్భుతమైన ప్రగతిశీల యుగంలో జీవిస్తున్నారని చెప్పారు.