హైదరాబాద్: 28°C
వార్తలు

కేంద్ర మాజీమంత్రి అరెస్ట్

కేంద్ర మాజీమంత్రి రవ్‌నీత్ బిట్టును పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. సీఎం భగవంత్ మాన్ కాన్వాయ్‌పై టమోటో, గుడ్లు విసరడానికి యత్నించడంతో ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిన్న తన కాన్వాయ్‌పై ఆప్ కార్యకర్తలు గుడ్లు, టమోటోలు విసిరారని బిట్టు ఆరోపించారు. దీని ప్రతిచర్యగానే సీఎం కాన్వాయ్‌పై గుడ్లు విసరడానికి కేంద్ర మాజీమంత్రి యత్నించారని సమాచారం.