మధ్యప్రదేశ్‌లో కేంద్ర మంత్రి సింధియాకు నిరసన సెగ తగిలింది. గుణా పర్యటనకు వెళ్లిన సింధియాను ఓ స్థానికుడు రోడ్డు అధ్వానంగా ఉందని, పని పూర్తి చేయకపోతే ప్రజలు ఓట్లు వేయరని అన్నాడు. దీనిపై స్పందించిన సింధియా.. 'నాతో అలా మాట్లాడొద్దు' అంటూ అతడిని హెచ్చరించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించినందుకు అధికారులను సింధియా మందలించిన పర్యటనలోనే ఈ ఘటన జరగడం గమనార్హం.
వార్తలు
కేంద్రమంత్రికి నిరసన సెగ


