ఎమ్మెల్యేనే సైబర్ కేటుగాళ్లు బురిడి కొట్టించిన ఘటన యూపీలో జరిగింది. చైల్ నియోజకవర్గ ఎమ్మెల్యే పూజా పాల్ తన యూనియన్ బ్యాంక్ ఖాతా నుంచి దశల వారీగా దుండగులు రూ.1.55 లక్షలు మాయం చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన ఫోన్‌ను ఎవరో హ్యాక్ చేసి ఫోన్ పే ద్వారా ఈ మోసానికి పాల్పడి ఉండొచ్చని ఆమె వాపోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు.
వార్తలు
ఎమ్మెల్యే ఖాతా నుంచి రూ.1.55 లక్షలు చోరీ


