UPI చెల్లింపులపై కొత్తగా అమల్లోకి రానున్న MDR అందరినీ టెన్షన్ పెడుతోంది. దీనిపై పెట్రోల్ పంప్ డీలర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఛార్జీల నుంచి ఇంధన విక్రయాలను మినహాయించాలని డిమాండ్ చేస్తున్నారు. తమ డిమాండ్‌ను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోకపోతే రూ.2 వేలకు మించిన UPI చెల్లింపులను స్వీకరించబోమని మధ్యప్రదేశ్ సహా పలు ప్రాంతాల డీలర్లు హెచ్చరిస్తున్నారు.
వార్తలు
పెట్రోల్ పంపుల్లో UPI చెల్లింపులకు బ్రేక్?


