హైదరాబాద్: 28°C
వార్తలు

‘భారత్‌లో కర్బన ఉద్గారాలు చాలా తక్కువ’

ఢిల్లీలో జరిగిన పర్యావరణ అంతర్జాతీయ సదస్సులో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. కర్బన ఉద్గారాలకు అభివృద్ధి చెందుతున్న దేశాలపై నిందలు వేయడం సరికాదన్నారు. భారత్ తలసరి కర్బన ఉద్గారాలు ప్రపంచ సగటు కంటే సగానికి తక్కువని స్పష్టం చేశారు. అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ ఉద్గారాలు భారత్ కంటే ఆరు రెట్లు ఎక్కువగా ఉన్నాయని, ఈ విషయాన్ని ప్రపంచ వేదికలపై భారత్ కుండబద్దలు కొడుతోందన్నారు.