హైదరాబాద్: 28°C
వార్తలు

‘UPI ఛార్జీలు పగటిపూట దోపిడీ’

యూపీఐ లావాదేవీలపై MDR ఛార్జీల విధింపు పగటిపూట దోపిడీ లాంటిదని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే మండిపడ్డారు. గడ్చిరోలిలో(MH) ఆయన మాట్లాడుతూ.. పెద్ద నోట్ల రద్దు సమయంలో నగదు రహిత ఆర్థిక వ్యవస్థ గురించి గొప్పలు చెప్పారని ఎద్దేవా చేశారు. తీరా ప్రజలు క్యాష్‌లెస్ లావాదేవీలకు అలవాటు పడ్డాక పన్నులు విధించడం దారుణమన్నారు. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.