ఐఐటీ బాంబేలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అక్కడ సెకండ్ ఇయర్ చదువుతున్న 19 ఏళ్ల విద్యార్థి నిన్న తన హాస్టల్ గదిలో శవమై కనిపించాడు. ఇటీవల జరిగిన ఓ పరీక్షలో సదరు విద్యార్థి మొబైల్ ఫోన్‌తో దొరికిపోయాడు. ఆ అవమానం భరించలేక, తీవ్ర మనస్తాపానికి గురైన ఆ యువకుడు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
వార్తలు
ఎగ్జామ్ హాల్‌లో దొరికిపోయి.. స్టూడెంట్ సూసైడ్


