హైదరాబాద్: 28°C
వార్తలు

51 వేల మందికి నియామక పత్రాల పంపిణీ

ఢిల్లీలో ఇవాళ 20వ రోజ్‌గార్ మేళా జరగనుంది. ఈ కార్యక్రమం ద్వారా కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఉద్యోగాలు పొందిన 51 వేల మంది యువతకు ప్రధాని మోదీ నియామక పత్రాలను అందజేయనున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని ఈ అపాయింట్‌మెంట్‌ లెటర్లను పంపిణీ చేస్తారు. ముఖ్యంగా రైల్వే, రెవెన్యూ వంటి కీలక శాఖల్లో ఎంపికైన అభ్యర్థులకు ఈ ప్రభుత్వ కొలువులు దక్కాయి.