అరేబియా సముద్రంలో భారత్-పాక్ యుద్ధ నౌకలు ఢీకొన్న ఘటనపై పాక్ ఆరోపణలను భారత్ ఖండించింది. భారత నౌక రెచ్చగొట్టే చర్యలకు పాల్పడిందన్న పాక్ వాదనలు అసంబద్ధమని విదేశాంగ శాఖ ప్రతినిధి రణ్‌ధీర్ జయస్‌వాల్ స్పష్టం చేశారు. సముద్ర నిబంధనలు, 1991 ఒప్పందాన్ని పాక్ ఉల్లంఘించిందని మండిపడ్డారు. ఈ ఘటనలో ఐఎన్‌ఎస్ కోల్‌కతాకు పెద్దగా నష్టం జరగలేదని తెలిపారు.
వార్తలు
పాక్ ఆరోపణలను ఖండించిన భారత్


