హైదరాబాద్: 28°C
వార్తలు

భక్తులను ఆకట్టుకున్న కోలాట ప్రదర్శన

KDP: సిద్ధవటం(M) మాధవరం-1లోని శ్రీ భద్రావతి భావనారాయణ స్వామి సన్నిధిలో వినాయక చవితి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 4వ రోజు శుక్రవారం రాత్రి కోలాట ప్రదర్శన నిర్వహించారు. మహిళలు, యువత ఉత్సాహంగా పాల్గొని సంప్రదాయ కోలాటం ప్రదర్శించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై కోలాట ప్రదర్శనను ఆసక్తిగా తిలకించారు. ఆలయ ప్రాంగణం భక్తులతో సందడిగా మారింది.