KNR: సైదాపూర్ మండలం వెన్నంపల్లి 33/11 కేవీ సబ్‌స్టేషన్‌లో నూతన 5 ఎంవీఏ ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో శనివారం విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఏఈ రమణారెడ్డి తెలిపారు. మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు సరఫరా బంద్ ఉంటుందన్నారు. వెన్నంపల్లి, సోమారం, ఆరెపల్లి, లస్మన్నపల్లి, రాంచంద్రాపూర్, ఎలబోతారం గ్రామాల ప్రజలు సహకరించాలని కోరారు.
వార్తలు
నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం


