హైదరాబాద్: 28°C
వార్తలు

ఓటు చోరీ.. ప్రభుత్వం చోరీ.. ఇప్పుడు పార్టీ చోరీ: రాహుల్‌

విడగొట్టి.. ఎన్నికల గుర్తును లాక్కోవడం ఈసీ, బీజేపీలకు అలవాటైపోయిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. మొదట శివసేన, ఆ తర్వాత ఎన్సీపీ.. ఇప్పుడు టీఎంసీ వంత అని ధ్వజమెత్తారు. పార్టీలను చీల్చడానికి బీజేపీ, ఈసీ చేతులు కలుపుతాయని.. ఆ తర్వాత దాని ఎన్నికల గుర్తును లాగేసుకుంటాయని ఆరోపించారు. ఓటు దొంగలు, ప్రభుత్వ దొంగలు.. ఇప్పుడు పార్టీల దొంగలుగా మారారని దుయ్యబట్టారు.