హైదరాబాద్: 28°C
వార్తలు

పాక్‌ తీరుపై మండిపడ్డ భారత్‌

అరేబియా సముద్రంలో భారత్-పాక్ యుద్ధ నౌకలు ఢీకొన్న ఘటనలో దాయాది దేశం చేస్తున్న ఆరోపణలను భారత్ తీవ్రంగా ఖండించింది. భారత నౌక రెచ్చగొట్టే, ఆమోదయోగ్యం కాని చర్యలకు పాల్పడిందని పాక్ విదేశాంగశాఖ చేసిన ఆరోపణలు అసంబద్ధమైనవని పేర్కొంది. భారత్‌పై నిందలు వేసేందుకు దాయాది దేశం చేసిన ప్రయత్నాలన్నీ ముందస్తుగా ఊహించినవేనని ఆ దేశ ఆరోపణలను తిరస్కరిస్తున్నట్లు వెల్లడించింది.