హైదరాబాద్: 28°C
వార్తలు

పరీక్షా సంస్కరణలపై సుప్రీంకోర్టు విచారణ

పరీక్షా సంస్కరణలపై సుప్రీంకోర్టు విచారణ నిర్వహించింది. పరీక్షా సంస్కరణలపై కమిటీలు సిఫార్సులు చేయడం మాత్రమే కాకుండా.. వాటని సంస్థాగతంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని కోర్టు వెల్లడించింది. హైపవర్డ్ కమిటీ ఇచ్చిన సూచనల తర్వాత సాధించిన పురోగతిపై రెండు వారాల్లోగా నివేదిక ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించింది. ఈ మేరకు తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.