హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

సిద్దిపేట పట్టణంలోని కోటిలింగాల, హౌసింగ్ బోర్డు ఫీడర్ల పరిధిలో శనివారం ఉదయం 9 నుంచి 12 గంటల వరకు కరెంట్ నిలిపివేస్తున్నట్లు ఏడీఈ సుధాకర్ రెడ్డి తెలిపారు. చెట్ల కొమ్మల తొలగింపు వల్ల హౌసింగ్ బోర్డు, మీనాక్షినగర్, మధురనగర్ ప్రాంతాల్లో సరఫరా ఉండదన్నారు. వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు