హైదరాబాద్: 28°C
వార్తలు

జనసేన మేయర్ అభ్యర్థిగా అవకాశం ఇవ్వాలని వినతి

కడప మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యక్ష మేయర్ ఎన్నికల్లో జనసేన తరపున తనను అభ్యర్థిగా పరిశీలించాలని కోరుతూ.. పార్టీ కడప అసెంబ్లీ ఇంఛార్జ్ సుంకర శ్రీనివాస్ శుక్రవారం తెనాలిలో మంత్రి నాదెండ్ల మనోహర్‌ను కలిశారు. ఈ సందర్భంగా తన బయోడేటా, అభ్యర్థిత్వ ప్రతిపాదనను అందజేశారు. పార్టీ అవకాశం కల్పిస్తే కూటమి నేతల సమన్వయంతో ఎన్నికల్లో పనిచేస్తామని తెలిపారు.