హైదరాబాద్: 28°C
వార్తలు

మమతకు 'శ్రీరాముడి శాపం': సీఎం

టీఎంసీ తన పేరును, గుర్తును కోల్పోవాల్సి రావడానికి బీజేపీ ప్రమేయం లేదని.. మొత్తం మాజీ సీఎం మమతా బెనర్జీ అహంకారమే కారణమని పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారి మండిపడ్డారు. అహంకారం ప్రదర్శించే వారికి ఎప్పటికైనా గుణపాఠం తప్పదన్నారు. ఈ పరిణామాన్ని శ్రీరాముడి శాపంగా అభివర్ణించారు. భవిష్యత్తులో టీఎంసీ ఉనికి ఉండదని తాను ఎన్నికల సమయంలోనే చెప్పానని గుర్తు చేశారు.