హైదరాబాద్: 28°C
వార్తలు

చర్యలు తీసుకోకపోతే కౌంటింగ్ నిలిపివేస్తాం: హైకోర్టు

ఢిల్లీ వర్సిటీ విద్యార్థి సంఘం ఎన్నికల్లో గూండాగిరి ఆరోపణలపై హైకోర్టు మండిపడింది. 'మీ పద్ధతి మార్చుకోరా' అంటూ విద్యార్థి సంఘాల ప్రవర్తనను ఖండించింది. క్యాంపస్‌లోకి పెద్ద సంఖ్యలో వాహనాలను ఎలా అనుమతి ఇస్తారని అధికారులను ప్రశ్నించింది. దీనిపై రేపటిలోగా చర్యలు తీసుకోకపోతే కౌంటింగ్ నిలిపివేస్తామని హెచ్చరించింది. అలాగే ఫలితాల అనంతరం విజయోత్సవ ర్యాలీలను నిషేధించింది.