హైదరాబాద్: 28°C
వార్తలు

పీఎఫ్ పరిమితి పెంపు.. జీతం తగ్గుతుందా?

ఉద్యోగుల పీఎఫ్ వేతన పరిమితిని రూ.15 వేల నుంచి రూ.25 వేలకు కేంద్రం ఇటీవల పెంచింది. ఈ నిర్ణయంతో.. ఉద్యోగుల వేతనం నుంచి ప్రతినెలా కట్ అయ్యే పీఎఫ్ వాటా రూ.1,800 నుంచి రూ.3,000కు పెరుగుతుంది. దీంతో ప్రతి నెలా చేతికి వచ్చే టేక్ హోమ్ శాలరీలో రూ.1,200 కోత పడుతుంది. కానీ మీ భవిష్యత్తు అవసరాల కోసం దాచుకునే పీఎఫ్ నిధి మాత్రం వేగంగా పెరుగుతుంది.