2026-27 ఆర్థిక సంవత్సరానికి భారత జీడీపీ వృద్ధి రేటు అంచనాను 'మూడీస్' సంస్థ 6% నుంచి 7 శాతానికి పెంచింది. పశ్చిమాసియా ఉద్రిక్తతల నడుమ కూడా భారత ఆర్థిక వ్యవస్థ దృఢంగా ఉందని ప్రశంసించింది. 2026 తొలి ఆరు నెలల్లో జీడీపీ వృద్ధి 8.2 శాతంగా నమోదైందని, పెట్టుబడులు పెరగడమే దీనికి కారణమని తెలిపింది. జీ-20 దేశాల్లో భారత్‌దే అత్యంత వేగవంతమైన వృద్ధి అని పేర్కొంది.
వార్తలు
‘జీ-20 దేశాల్లో భారత్‌దే అగ్రస్థానం’


