హైదరాబాద్: 28°C
వార్తలు

‘మోదీ జ్ఞాపకశక్తి, ధైర్యం అద్భుతం’

ప్రధాని మోదీ 76వ పుట్టినరోజు సందర్భంగా ఆయన చిన్ననాటి గురువు H.C.పటేల్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. వాద్‌నగర్ స్కూల్‌లో మోదీకి సైన్స్ బోధించిన ఆయన.. మోదీ జ్ఞాపకశక్తి, ధైర్యం అద్భుతమన్నారు. బాల్యంలో మొసలి పిల్లను పట్టుకొచ్చిన ధైర్యశాలి అని కొనియాడారు. స్కూల్ నాటకంలో ఆయన నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారన్నారు. మోదీ ఇంతటి ఉన్నతస్థాయికి చేరతారని అప్పట్లో ఊహించలేదన్నారు.