హైదరాబాద్: 28°C
వార్తలు

లాల్‌బాగ్చా రాజా దర్శనానికి భక్తజనం

వినాయక చవితి సందర్భగా ముంబైలోని ప్రముఖ లాల్‌బాగ్చా రాజా గణపతిని దర్శించుకుని వేలాది మంది భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలు సెప్టెంబర్ 25 అనంత చతుర్దశి (నిమజ్జనం) వరకు 12 రోజుల పాటు అట్టహాసంగా కొనసాగనున్నాయి. భక్తుల సౌకర్యార్థం 'ముఖ దర్శనం', అలాగే స్వామివారి పాదాలను తాకి మొక్కులు తీర్చుకునే 'చరణ్ స్పర్శ్' లైన్లను అందుబాటులో ఉంచారు.