హైదరాబాద్: 28°C
వార్తలు

‘విద్యార్థుల జుట్టుపై ఆంక్షలొద్దు’

విద్యార్థుల జుట్టు పొడవుపై పాఠశాలలు, తల్లిదండ్రులు తమ నిర్ణయాలను బలవంతంగా రుద్దకూడదని కేరళ బాలల హక్కుల కమిషన్ స్పష్టం చేసింది. తమకు నచ్చినట్లు జుట్టు పెంచుకునే హక్కు పిల్లలకు ఉందని తేల్చిచెప్పింది. జుట్టు సాకుతో అబ్బాయిలు, ట్రాన్స్‌జెండర్లపై వివక్ష చూపడం, తరగతి నుంచి గెంటేయడం లాంటివి చేయకూడదని హెచ్చరించింది. జుట్టు కళ్లను కప్పకుండా శుభ్రంగా ఉంటే చాలని చెప్పింది.