హైదరాబాద్: 28°C
వార్తలు

గుంటూరు మార్కెట్‌లో మిర్చి ధరలు

గుంటూరు: వ్యవసాయ మార్కెట్‌కు సుమారు 45 వేల బస్తాల మిర్చి అమ్మకానికి వచ్చింది. మార్కెట్లో తేజా రకం కిలో రూ.170 నుంచి రూ.230 వరకు పలికింది. 2043 బ్యాడగి రకం గరిష్ఠంగా రూ.180 నుంచి రూ.380 వరకు పలికింది. నాటు రకాలు కిలో రూ.180 నుంచి రూ.295 వరకు అమ్ముడయ్యాయి. ప్రస్తుతం కొనుగోళ్లు నెమ్మదిగా సాగుతున్నా.. రానున్న రోజుల్లో ధరలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి.