హైదరాబాద్: 28°C
వార్తలు

భూటాన్‌కు భారత్ ప్రత్యేక బహుమతి

భూటాన్ పర్యటనలో భాగంగా కేంద్రమంత్రి జైశంకర్ ఆ దేశానికి ప్రత్యేక బహుమతిని అందించారు. భూటాన్‌కు భారత్ తరఫున 43 స్వచ్ఛమైన జెర్సీ జాతి ఆవులను అందజేశారు. ఆ దేశంలో పాల ఉత్పత్తిని పెంచడంతో పాటు స్థానిక రైతులకు మద్దతు అందించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని జైశంకర్ తెలిపారు. ఈ ఆవుల వల్ల సుమారు 40 వేల మంది రైతులకు ప్రయోజనం చేకూరే అవకాశం ఉందని చెప్పారు.