VZM: చినబంటుపల్లి నుంచి గరివిడి వెళ్లే ప్రధాన రహదారి గుంతలమయమై అధ్వానంగా తయారైంది. ఈ మార్గంలో నిత్యం ప్రయాణించే వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెద్ద ఎత్తున గుంతలు ఏర్పడటంతో ప్రయాణం నరకప్రాయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి, రోడ్డును మరమ్మత్తు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
వార్తలు
VIDEO: అధ్వానంగా మారిన గరివిడి రోడ్డు


