హైదరాబాద్: 28°C
వార్తలు

కౌశలం మేళాలో 109 మందికి ఉద్యోగాలు

నంద్యాల కలెక్టరేట్‌లో గురువారం నిర్వహించిన కౌశలం ఉద్యోగ మేళాకు 301 మంది నిరుద్యోగ యువత హాజరయ్యారు. డిక్సన్ టెక్నాలజీస్, అవ్సర్ సంస్థల ప్రతినిధులు అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఇందులో 109 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఎంపికైన వారికి అధికారులు ఆఫర్ లెటర్లు అందజేశారు.