హైదరాబాద్: 28°C
వార్తలు

జాతీయ బాడీబిల్డింగ్‌లో అద్భుత ప్రతిభ

RR: ఆల్ ఇండియా బాడీబిల్డింగ్ ఛాంపియన్‌షిప్‌లో 4వ స్థానం సాధించిన షాద్‌నగర్‌కు చెందిన మాదిరాజు దుర్గ ప్రసాద్‌ను, ఆయన తల్లిదండ్రులను ఎంపీ డీకే అరుణ ఘనంగా సన్మానించారు. తొలి ప్రయత్నంలోనే ఈ విజయం సాధించడం అభినందనీయమని, ఆయన పట్టుదల యువతకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. భవిష్యత్తులో దుర్గ ప్రసాద్ మరిన్ని అంతర్జాతీయ పతకాలు సాధించాలని ఆకాంక్షించారు.