హైదరాబాద్: 28°C
వార్తలు

వైద్య విద్యార్థి భార్గవ్ కుమార్‌కు ఆర్థిక చేయూత

RR: గండిపేట నార్సింగి సర్కిల్ మణికొండ జడ్పీ హైస్కూల్‌లో పదో తరగతి చదివి, నిర్మల్ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో వైద్య సీటు సాధించిన యూ.భార్గవ్ కుమార్‌కు మణికొండ మాజీ ఫ్లోర్ లీడర్ రామకృష్ణారెడ్డి ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఆర్థిక ఇబ్బందులు చదువుకు అడ్డంకి కాకూడదన్నారు. ఆయన మిత్రుడు పద్మోజిరావు రూ.25,000 సాయం అందించారు.