హైదరాబాద్: 28°C
వార్తలు

జాతీయస్థాయి పోటీలకు రొంపిచర్ల విద్యార్థులు

PLD: బొబ్బిలిలో జరిగిన రాష్ట్రస్థాయి సబ్‌జూనియర్ సాఫ్ట్‌బాల్ పోటీల్లో గుంటూరు జిల్లా జట్టు ద్వితీయ స్థానం సాధించింది. జట్టులోని రొంపిచర్ల పాఠశాలకు చెందిన ఐదుగురు క్రీడాకారులు ఏపీ రాష్ట్ర జట్టుకు ఎంపికయ్యారు. ఈ నెలాఖరులో ఔరంగాబాద్‌లో జరిగే జాతీయ పోటీల్లో వారు పాల్గొననున్నారు. ఎంపికైన వారిని రిటైర్డ్ హెచ్‌ఎం ఎన్. రామకృష్ణారెడ్డి అభినందించారు.