TG: కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనలో సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యమిచ్చిందని డిప్యూటీ సీఎం విక్రమార్క తెలిపారు. ఖమ్మంలో నిర్వహించిన తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పేదలు, రైతులు, మహిళలు, యువత, విద్యార్థుల సంక్షేమానికి పెద్దపీట వేశామన్నారు. 2030నాటికి తెలంగాణను హరిత ఇంధన రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని చెప్పారు.
వార్తలు
సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట: భట్టి


