హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: బీజేపీ కార్యాలయంలో రక్తదాన శిబిరం

VSP: ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా విశాఖ ఉత్తర నియోజకవర్గ బీజేపీ కార్యాలయంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఎమ్మెల్యే పి. విష్ణుకుమార్‌ రాజు ప్రారంభించిన ఈ శిబిరంలో సుమారు 100 మంది యువకులు రక్తదానం చేశారు. రక్తదానం ప్రాణాలను కాపాడే గొప్ప సేవ అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, కూటమి నేతలు పాల్గొన్నారు.