హైదరాబాద్: 28°C
వార్తలు

మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ

మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ కీలక నేత అసిమ్ మండల్ అలియాస్ ఆకాశ్ కోల్‌కతా పోలీసులు ఎదుట లొంగిపోయాడు. 2011లో మావోయిస్టు పార్టీ అగ్రనేత కిషన్‌జీ మరణం తర్వాత బెంగాల్‌లో పార్టీ బాధ్యతలను అసీమ్ దగ్గరుండి నడిపిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇతడిపై జార్ఖండ్ ప్రభుత్వం, రూ.1 కోటి, ఒడిశా ప్రభుత్వం రూ.1.20 కోట్ల భారీ రివార్డును ప్రకటించాయి.