హూతీలు, సౌదీ అరేబియా మధ్య ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరుకున్న వేళ ప్రముఖ చమురు సంస్థ సౌదీ ఆరామ్ కో కీలక నిర్ణయం తీసుకుంది. భారతీయ రిఫైనరీలకు చమురు సరఫరాను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఈ ఆంక్షలు కొనసాగుతాయని వెల్లడించింది. భారతీయ రిఫైనరీలకు ఆరామ్ కో కీలకమైన సరఫరాదారు కావడంతో దేశంలో చమురు ధరలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
వార్తలు
భారతీయ రిఫైనరీలకు సౌదీ షాక్


