హైదరాబాద్: 28°C
వార్తలు

సీఐపై చర్యలకు జర్నలిస్టుల డిమాండ్

KRNL: పత్తికొండ అర్బన్‌ సీఐ జయన్నపై చర్యలు తీసుకోవాలని ఏపీయూడబ్ల్యూజే నాయకులు డిమాండ్‌ చేశారు. విలేకరి నాగరాజుపై దురుసుగా ప్రవర్తించినట్లు ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలని కోరారు. విలేకరులపై నమోదైన కేసులను ఎత్తివేయాలని డిమాండ్‌ చేస్తూ ఆలూరు తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. అనంతరం తహసీల్దార్‌ శోభా సువర్ణమ్మకు వినతిపత్రం అందజేశారు.