హైదరాబాద్: 28°C
వార్తలు

మిగ్‌-29 కూలినట్లు పాక్‌ ప్రచారం.. ఖండించిన భారత్‌

ల్యాండింగ్ అవుతున్న సమయంలో భారత మిగ్-29 కూలినట్లు పాక్ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని భారత్ తిప్పికొట్టింది. దాయాది దేశం చేస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ తేల్చి చెప్పింది. వార్ థండర్ అనే మిలిటరీ కాంబాట్ వీడియో గేమ్‌కు సంబంధించిన క్లిప్‌ను వీడియోగా తీసి SMలో ప్రచారం చేస్తుందని మండిపడింది. దయచేసి ఇటువంటి పుకార్లను నమ్మవద్దని సూచించింది.